ఐలోనిలో ప్రత్యేక పూజలు..
ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండోరోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సమర్పించే నిత్య పూజలతోపాటు గవ్యాంత, వాస్తుపూజలు, పర్యగ్నికరణ, రుద్రహోమం, ప్రాతరౌపాసన బలిహరణలు నిర్వహించారు. లింగోధ్భవ కాలంలో స్వామిని అభిషేకించే 108 కలశాలను స్థాపించారు. కాగా, స్వామి, అమ్మవార్లను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. మాడ వీధుల్లో ఉదయం అశ్వవాహన సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించగా భక్తులు భజనలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శ ర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నంద నం భానుప్రసాద్ శర్మ, నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, మడికొండ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, ఆలయ సిబ్బంది పాల్లొన్నారు.
బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ..
మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు పెద్దపట్నం వద్ద తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మామునూరు ఏసీపీ తిరుపతి, పర్వతగిరి సీఐ రాజగోపాల్ మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment