సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి
వరంగల్ చౌరస్తా : బీజేపీ బలపర్చిన వరంగల్–ఖమ్మం–న ల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వరంగల్ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏజెంట్లతో సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ తూళ్ల వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాలకు పైగా అనుభవమున్న వ్యక్తి అని, ఉపాధ్యాయ సమస్యలు సరోత్తంరెడ్డికి తెలుసని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు కపిలవాయి రవీందర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఎన్నికల కన్వీనర్ బైరి మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment