ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ
వరంగల్ క్రైం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. వేయిస్తంభాల ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు లేవని పేర్కొన్నారు. భక్తులు సాధ్యమైనంత వరకు త్వరగా చేరుకుని దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు. ములుగు రోడ్డు నుంచి వేయిస్తంభాల ఆలయానికి వచ్చే వాహనాలు అలంకార్ జంక్షన్ వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలను అమృత జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ములుగు రోడ్డు నుంచి వచ్చే ఆటోలు, ద్విచక్రవాహనాలు బాలాంజనేయస్వామి దేవాలయం మీదుగా వెళ్లాలని, కాపువాడ రోడ్డుకు ఇరు వైపులా ఎలాంటి పార్కింగ్ చేయరాదని, ఈమార్గంలో తోపుడు బండ్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. హనుమకొండ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు అమృత జంక్షన్ నుంచి యాదవనగర్ మీదుగా వెళ్లాలని, ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 26న ఉద యం 3 గంటల నుంచి 27న మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని ఏసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment