నీటిఎద్దడి లేకుండా చూడాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వరంగల్ అర్బన్: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద ఇంజనీర్లను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. చివరి ఇంటి వరకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తికావడంతో నీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. గతంలో నీటి సరఫరాలో సమస్య ఉండేదని, ప్రస్తుతం నీటి సరఫరా బాగుందని స్థానికులు రాజమణి, సక్కుబాయి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్న ఏఈ హరికుమార్‌ను కలెక్టర్ ప్రశంసించారు. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు దేశాయిపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను కలెక్టర్ సందర్శించారు. నీటి సరఫరా తీరుతోపాటు ధర్మసాగర్ నుంచి ఫిల్టర్‌బెడ్‌కు ఎంత రా వాటర్ చేరుతోంది, నీటి శుద్ధీకరణకు ఎంత నిష్పత్తిలో రసాయనాలు కలుపుతారు అని అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈ శ్రీనివాస్, డీఈ రాజ్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఏఈలు హరికుమార్, మొజామిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment