గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
రాత్రి వేయిస్తంభాల గుడి వద్ద స్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులు
మెట్టుగుట్టలో రామలింగేశ్వరస్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులు, రాత్రి స్వామివారి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు
వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరిల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు,
హాజరైన భక్తులు
వేయిస్తంభాల ఆలయంలో లింగానికి హారతినిస్తున్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మహానగరం శివనామస్మరణతో మార్మోగింది. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు తరలివెళ్లి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు. మారేడు పత్రి, పూలు, పండ్లు, టెంకాయలు స్వామివారికి సమర్పించారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాల్లోని క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయం, స్వయంభూ శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం, ఖిలా వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం, స్టేషన్‌రోడ్డు, కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయాలు, మడికొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జాగరణ చేసిన భక్తుల కోసం ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. – హన్మకొండ కల్చరల్
వరంగల్ కాశీవిశ్వేరుని ఆలయంలో దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment