టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్‌కు రెడీ
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉద యం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. హనుమకొండ జిల్లాలో 5,215 మంది, వరంగల్‌లో 2,352 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ మెటీరియల్‌ను సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షించారు. సామగ్రిని తీసుకున్న సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లిపోయారు. అంతకుముందు పోలింగ్ నిర్వహణపై కలెక్టర్ ప్రావీణ్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రూట్, జోనల్ ఆఫీసర్లు, పీఓలు, ఏసీఓలు, మైక్రోఅబ్జర్వర్లు ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను జాగ్రత్తగా సీల్ చేయాలని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తితే జోనల్ అధికారిని సంప్రదించాలని సూచించారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద సందర్శించారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు ఉన్నారు.
సరిహద్దు జిల్లాలో ఓటర్లు ఇప్పుడు ఇక్కడే..
● మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గానికి సంబంధించి హనుమకొండ జిల్లాలో 166 మంది ఓటర్లు ఉన్నారు.
● మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి 4,585 మంది ఓటర్లున్నారు.
● ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, మైక్రోఅబ్జర్వర్‌ను నియమించారు.
● గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వేలేరు మండలాలు ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిధికి రావడంతో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఈ జిల్లా నుంచే ఉంటుంది.
జిల్లాల వారీగా ఓటర్ల జాబితా వివరాలు
నేడు ఓటు హక్కు వినియోగించుకోనున్న ఉపాధ్యాయులు
పోలింగ్ మెటీరియల్ పంపిణీ
కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి : హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
పోలింగ్ సమయం : ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
నిర్ణీత సమయానికి వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండ జిల్లాకేంద్రంలోని
స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు.
టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్‌కు రెడీ
Comments
Please login to add a commentAdd a comment