బెల్ట్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఖిలా వరంగల్: బెల్ట్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు చేసి రూ.1,21,540 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బార్లు, వైన్ షాపులు వేసివేశారు. దీంతో ముందుగానే వరంగల్ సాకరాశికుంటకాలనీలోని పలువురు తమ ఇళ్లలో భారీగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీకి విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో మద్యం నిల్వ చేసిన ఇళ్లు, బెల్ట్‌షాపులపై దాడులు చేశారు. సాకరాశికుంటకు చెందిన ఎనుగందుల శంకర్, ఎనుగందుల సృజన వద్ద రూ.65,790 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. శివ వైన్స్ ఓనర్ పరారీలో ఉండగా.. సాకరాశికుంటకు చెందిన చింత రాధిక వద్ద రూ.55,750 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నంకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.
రూ.1.21 లక్షల విలువైన
మద్యం స్వాధీనం
ముగ్గురిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment