
పార్కుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టండి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: పార్కుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని బల్ది యా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారుల్ని ఆదేశించారు. గురువారం వరంగల్ నగర పరిధి టెలికాం కాలనీ, ఎల్బీనగర్ పార్క్, క్రిస్టియన్ కాలనీలో బల్దియా నిర్వహిస్తున్న నర్సరీని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలిచ్చారు. పార్కులో వర్షాకాలం నీరు నిలుస్తోందని ఎల్బీనగర్ స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 20వ డివిజన్‌లో తిలక్‌రోడ్డు విస్తరణ పనుల్ని ఆమె పరిశీలించారు. ఈతనిఖీల్లో అధికారులు లక్ష్మారెడ్డి, ఈఈ శ్రీనివాస్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ప్రిన్సీ, అనూహ పాల్గొన్నారు.
పన్ను వసూళ్లలో పురోగతి అవసరం..
ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో పురోగతి అవసరమని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బల్దియా పరిధి 21వ డివిజన్ ఎల్బీనగర్‌లో కొనసాగుతున్న పన్ను వసూళ్ల తీరును క్షేత్రస్థాయిలో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, రెవెన్యూ అధికారి షహజాదీ బేగం, ఆర్‌ఐ సోహైల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment