
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..
ఖిలా వరంగల్: వరంగల్ భట్టుపల్లి రహదారిపై ఎస్‌ఆర్ స్కూల్ సమీపాన ఈనెల 20న డాక్టర్ గాదె సుమంత్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడింది. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రదారి అని తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ సహకారంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు గాదె ఫ్లోరా, ప్రియుడు సంగారెడ్డికి చెందిన ఎర్రోళ్ల శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్‌నాయక్.. ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం, ఎస్సై సురేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
హత్యకు రూ. లక్ష అడ్వాన్స్..
తన భర్త సుమంత్‌రెడ్డిని పక్కాగా హతమార్చేందుకు 15 రోజుల క్రితం ఫ్లోరా తన ప్రియుడు శామ్యూల్‌కి రూ.లక్ష అడ్వాన్స్ అందజేసింది. శామ్యూల్ రూ.50వేలు తన దగ్గర ఉంచుకుని, రూ.50వేలు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు ఇచ్చాడు. అడ్వాన్స్ ముట్టడంతో ఏఆర్ కానిస్టేబుల్ విధులకు మూడు రోజులు సెలవు పెట్టాడు. ఈనెల 20వ తేదీన సంగారెడ్డిలో సుత్తి కొనుగోలు చేసి రాజ్‌కుమార్‌కు చెందిన బైక్‌పై ఇద్దరు నేరుగా కాజీపేట చేరుకున్నారు. సీసీ కెమెరాలు, జన సంచారం లేని చీకటి ప్రదేశాన్ని హత్యకు స్పాట్‌గా ఎంచుకున్నారు. రాత్రి 10.30కి సుమంత్‌రెడ్డి క్లినిక్ బంద్ చేసి తన కారులో కడిపికొండ బ్రిడ్జి మీదుగా భట్టుపల్లి నుంచి వరంగల్‌లోని ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో సుమంత్‌రెడ్డి ప్రయాణించే కారు వెంబడిస్తూ శ్యామ్యూల్, రాజ్‌కుమార్ బైక్‌పై బయలుదేరారు. భట్టుపల్లి దాటిన తర్వాత ఎస్‌ఆర్ స్కూల్ సమీపాన చిన్న బ్రిడ్జి వద్దకు రాగానే శామ్యూల్ సుత్తితో కారుఇండికేటర్‌పై కొట్టాడు. దీంతో భారీ శబ్ద రావడంతో సుమంత్‌రెడ్డి కారు రో డ్డు పక్కన నిలిపి వెనక వైపు వెళ్లి పరిశీలిస్తుండగా.. శామ్యూల్, రాజ్‌కుమార్ కలిసి సుమంత్‌రెడ్డి తల, మెడపై విచక్షణారహితంగా సుత్తితో కొట్టారు. దీంతో తీవ్రరక్తస్రావంతో సుమంత్‌రెడ్డి పడిపోగా చని పోయాడనుకొని భావించిన నిందితులిద్దరు ఘట నా స్థలి నుంచి బైక్‌పై సంగారెడ్డికి పరారయ్యారు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు..
సుమంత్ రెడ్డి హత్యాయత్నంపై తండ్రి ఆరోగ్య సుధాకర్ రెడ్డి వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫి ర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్, మిల్స్‌కాలనీ ఎస్సై సురేశ్, కానిస్టేబుల్ బావుసింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జలేందర్, ఎండీ గౌస్, ఎఎఓ సల్మాన్ ఐటీకోర్ కానిస్టేబుల్ నగేశ్ నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గురువారం నిందితులను సంగారెడ్డిలోని ఆదర్శకాలనీ కొండాపూర్‌లో ఏర్రోళ్ల శామ్యూల్, గాదె ఫ్లోరా, ఏఆర్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు.
ఏఆర్ కానిస్టేబుల్‌తో ఒప్పందం..
వరంగల్ చేరిన అనంతరం కూడా ఫ్లోరా.. శామ్యూల్‌తో ఫోన్‌లో మాట్లాడేది. భర్త లేని సమయంలో శామ్యూల్‌ను ఇంటికి పిలిపించుకునేది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్‌రెడ్డి భార్యను మందలించేవారు. దీనికి తనకు విడాకులు ఇవ్వాలని ఫ్లోరా డిమాండ్ చేసింది. ఇందుకు సుమంత్ రెడ్డి నిరాకరించడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఫ్లోరా, ప్రియుడి శామ్యూల్.. సుమంత్‌రెడ్డిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు వివరించాడు. సుమంత్‌రెడ్డి హత్యకు సహకరిస్తే సంగారెడ్డిలో భవనం నిర్మించి ఇస్తానని ఫ్లోరా చెప్పగా..రాజ్‌కుమార్ ఒప్పుకున్నాడు.
భర్తపై హత్యాయత్నం
వీడిన డాక్టర్ సుమంత్‌రెడ్డిపై
హత్యాయత్నం కేసు మిస్టరీ..
నిందితులు భార్య ఫ్లోరా, ప్రియుడు శామ్యూల్, సహకరించిన
ఏఆర్‌కానిస్టేబుల్ రాజ్‌కుమార్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన
వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్
వివాహేతర సంబంధమే కారణం..
వరంగల్‌కు చెందిన గాదె ఆరోగ్య సుధాకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సుమంత్‌రెడ్డి, వరంగల్‌లోని షిర్డీ సాయినగర్‌కు చెందిన ఫ్లోరా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ బంధువులకు చెందిన విద్యా సంస్థలను చూసుకునేందుకు భార్య ఫ్లోరాతో కలిసి సుమంత్‌రెడ్డి 2018లో వరంగల్ నుంచి సంగారెడ్డికి వెళ్లారు. అక్కడ సుమంత్‌రెడ్డి స్థానిక పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా బంధువుల విద్యా సంస్థల్లో పర్యవేక్షణతోపాటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి సంగారెడ్డిలోని సిద్ధు జిమ్‌సెంటర్‌కి వెళ్తుండేది. ఈ క్రమంలో సంగారెడ్డిలోని ఆదర్శకాలనీ కొండాపూర్‌కు చెందిన జిమ్ సెంటర్ కోచ్ ఏర్రోళ్ల శామ్యూల్ పరిచమయ్యాడు. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో గొడవ జరిగింది. సంగారెడ్డి నుంచి షిఫ్ట్ అయితే గొడవలు తగ్గుతాయని భావించిన సుమంత్‌రెడ్డి వరంగల్‌కు చేరారు. 2019లో ఫ్లోరా జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుండేది. ఆ కాలేజీ గతేడాది వరంగల్ రంగశాయిపేటకు మారడంతో విధులు ఇక్కడే నిర్వహిస్తుండగా.. సుమంత్‌రెడ్డి వరంగల్ హంటర్ రోడ్డు గ్రీన్‌వుడ్‌స్కూల్ సమీపాన వాసవికాలనీలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. సుమంత్‌రెడ్డి ప్రస్తుతం కాజీపేటలో ప్రైవేట్ ఆస్పత్రి నడుపుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment