
‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
వీసీలో సెర్ప్ సీఈఓ
దివ్య దేవరాజన్
వరంగల్: ఆన్‌లైన్‌లో యూడీఐడీ కార్డుల దరఖాస్తుపై దివ్యాంగుల కు అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. యూడీఐడీ, సోలార్ విద్యు త్ ప్లాంట్ల డీపీఆర్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రుల పర్యవేక్షకులు, సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్, ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో యూనిక్ డిజబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లకు యూడీఐడీ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. దివ్యాంగులు కచ్చితమైన చిరునామాతో www. swaral ambanacard.gov.inలో దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్‌లోకి వెళ్తుందని తెలిపారు. సెల్‌ఫోన్‌కు వచ్చిన షెడ్యూల్ మెసేజ్ ప్రకారం దివ్యాంగులు మెడికల్ క్యాంపునకు హాజరై తే ప్రత్యేక వైద్యులు పరిశీలించి వైకల్య శాతాన్ని నిర్ణయిస్తారని, ఆ తర్వాత సర్టిఫికెట్ మంజూరు చేస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి

‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment