
ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ రేవంత్‌కు దక్కదు
హన్మకొండ: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వీసమెత్తు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి దక్కద ని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. విమానాశ్రయాన్ని తాను తీసుకొచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చడమేనన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ స్ట్రిప్డ్‌గా ఏర్పాటు చేశారని, తాను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1976, 1978 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదన్నారు. 1980లో మూతపడిందని, అప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటే మామునూ రు ఎయిర్‌పోర్ట్ మరోలా ఉండేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్‌కు లేఖ రాస్తే శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల వరకు విమానాశ్రయం పెట్టొద్దని జీఎంఆర్‌తో 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నట్లు జవాబు ఇచ్చారన్నా రు. తెలంగాణ ఆవిర్భావం కాగానే కేసీఆర్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తుంటే నవ్వొస్తున్నద ని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, పులి రజనీకాంత్, నయీముద్దీన్ పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment