కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’ | - | Sakshi
Sakshi News home page

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

Published Mon, Mar 3 2025 1:10 AM | Last Updated on Mon, Mar 3 2025 1:10 AM

కూరగా

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

సోలోగా పాడేద్దాం..

వసంతోత్సవ వేడుకల ముగింపులో సంగీత విభావరిలో విద్యార్థులు వినూత్నంగా పాటలు పాడుతూ అలరించారు. నేను సోలోగా పాడుతా.. నువ్వు సోలోగా గీటార్‌ వాయించు అంటూ పోటీ పడ్డారు.

నాతో పోటీనా..?

స్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకల ముగింపులో భాగంగా చెస్‌లో నాతోనే పోటా అంటూ పోటీల్లో విద్యార్థులు తల పడ్డారు. నువ్వా..? నేనా? నేను వేసే ఎత్తుతో నువ్వు చిత్తు అంటూ ఆటలో మెదడుకు మేత పెట్టి పోటీల్లో విజయం సాధించారు.

మహబూబాబాద్‌ రూరల్‌ : షేడ్‌నెట్‌ హౌస్‌లో కూరగాయల సాగు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పరిమాణంలో నీటి అవసరం ఉంటుంది. అలాగే, ఎండ, వానా, చలికాలల్లో నుంచి పంటకు రక్షణ కలుగుతుంది. దీంతో కూరగాయలు తాజాగా ఉంటాయి. ప్రధానంగా వేసవిలో ఈ సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఈ విధానంలో ఎలా సాగు చేపట్టాలి.. ఏ విత్తనాలు అనుకూలం.. ఏ ఎరువులు వేయాలనే వివరాలు ఉద్యానశాఖ అధికారి శాంతిప్రియ తెలిపారు. ఈ మేరకు ఆమె రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

నాటేందుకు అనువైన మొక్కలు..

లేత మొక్కలు 5 నుంచి 6 వారాల వయస్సు ఉన్నవి షేడ్‌నెట్‌లో సాగుకు అనుకూలంగా ఉంటాయి.

అనువైన రకాలు..

టమాటలో సిన్‌జెంటా, హిమ్‌సోనా, హిమ్‌షేక్‌, ఇన్‌సోనా మొదలైనవి. చెర్రీ టమాటలో మొన్‌సాంట్‌, ఓల్వ్‌, రైస్‌, అంతేకాకుండా హరియాణా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్చికల్చర్‌ రీసెర్చ్‌ వారు అభివృద్ధి చేసిన రకాలు కూడా అనువైనవి.

ఎరువులు..

భూమి రకం, మొక్కను బట్టి ఎరువులు వాడుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం, దిగుబడుల కోసం 4 నుంచి 5 టన్నుల వరకు బాగా మాగిన ఎరువులు, 40 నుంచి 95 కేజీల నత్రజని, భాస్వరం, 40 నుంచి 45 కేజీల పొటాశ్‌ వేసుకోవాలి. సగం నత్రజని, పొటాశ్‌ ఎరువులతోపాటు మొత్తం భాస్వరం ఎరువు భూమి తయారు చేసేటప్పుడు వేయాలి.

మేలైన పద్ధతులు..

సక్కరింగ్‌...

మొక్కనుంచి కిందగా పెరిగే, గుబురుగా ఉండే కొమ్మలను తీసివేయాలి. కాండం సులువుగా పెరిగేలా చూసుకోవాలి.

మొక్కకు ఊతమివ్వటం..

మొక్కలు నాటిన అనంతరం ట్వైన్‌ దారం/సన్నని ప్లాస్టిక్‌ వైరుతో గాని ఊతంగా కట్టాలి. భూమి నుంచి కనీసం 3 మీటర్ల ఎత్తు సమాంతరంగా వైర్లు కట్టుకుని, ఊతంగా వాడిన వైర్లు దానికి కట్టాలి. (ట్రెల్లిస్‌ పద్ధతి)

పరాగ సంపర్కం..

షేడ్‌నెట్‌ హౌస్‌ ద్వారా కృత్రిమ పద్ధతిలో పరాగ సంపర్కం జరుగుతుంది. బ్రష్‌ ద్వారా పూల గుత్తుల మీద రుద్దడం ద్వారా (వారిని రెండుసార్లు చొప్పున) కాయలు కట్టడానికి తోడ్పాటు చేయాలి.

డీ లీఫింగ్‌..

ఆకులు ఎక్కువగా భూమిని తాకినప్పుడు రకరకాల ఫంగస్‌ సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా ఆకులు ఉన్నప్పుడు తీసివేయడం ద్వారా చక్కని సూర్యరశ్మి, గాలితోపాటు ఫంగస్‌ కూడా అరికట్టొచ్చు.

ఫ్రూట్‌ ఫ్రూనింగ్‌..

సైజు పూర్తిగా ఎదుగుదల కాని కాయలను తీసివేయడం ద్వారా నాణ్యమైన పెద్ద సైజు ఉన్న కాయలు దిగుబడిగా పొందొచ్చు.

నీరుపారించడం...

● సాధారణంగా 4 నుంచి 6 రోజుల వ్యవధిలో నీరు పారించాలి. మొక్కల ఎదుగుదలకు, వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీరు పెట్టాలి.

● సకాలంలో ఎరువులు వేయడం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం లాంటి పద్ధతులను అవలంబిస్తే సుమారు నాటిన 90 రోజులనుంచి కాపుకు వస్తుంది.

సాగులో మెళకువలు పాటిస్తే అధిక లాభాలు

ఉద్యాన శాఖ అధికారి శాంతిప్రియ

No comments yet. Be the first to comment!
Add a comment
కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’1
1/4

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’2
2/4

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’3
3/4

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’4
4/4

కూరగాయలకు ‘షేడ్‌ నెట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement