● పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన గృహిణి
మహబూబాబాద్ రూరల్ : ఓ గృహిణి తరచూ ఫోన్ చూస్తుండడంతో ఆగ్రహానికి గురైన భర్త మందలించడంతో ఆమె.. కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, భార్య రోజూ తర చూ ఫోన్ చూస్తుండడంతో అలా ఎందుకు చేస్తున్నావని భర్త మందలించాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమె తన కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కే.శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment