వసంతోత్సవానికి వీడ్కోలు..
● నిట్‌లో ముగిసిన ‘స్ప్రింగ్ స్ప్రీ–25’
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన వసంతోత్సవం ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు ఆదివారం ముగిశా యి. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకోవడంతో పాటు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. ముగింపు వేడుకల్లో పోలరాయిడ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, క్యూ ఫ్యాక్టర్, థింక్ డ్రాప్ రివీల్, పిక్చర్ ఫజిల్, సోలో ఐడల్, నుక్కడ్ నాటక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి సింగర్ నిఖిల్ డిసౌజా పాటలతో హోరెత్తించారు.
అటాక్.. నుక్కడ్ నాటక్..
నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక రుగ్మతలపై ధైర్యంగా పోరాడేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు కల్చ రల్ ఫెస్ట్‌లో అటాక్ నుక్కడ్.. నాటక్ పేరిట నాటక ప్రదర్శన నిర్వహించారు. ఇదీ ఎంతో ఆకట్టుకుంది.
వసంతోత్సవానికి వీడ్కోలు..
Comments
Please login to add a commentAdd a comment