అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ఏటూరునాగారం : అక్రమంగా పశువులను తరలి స్తున్న రెండు వాహనాలను ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో వై జంక్షన్ వద్ద్ద పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై తాజొద్దీన్ కథనం ప్రకారం.. ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా చర్ల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులు తరలిస్తున్న రెండు కంటైనర్లు, ఒక డీసీఎం వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. రహదారి కొనుగోలు అనుమతులు లేకుండా కిక్కిరిసి కట్టేసి ఆహారం (మేత), తాగునీటి సౌకర్యం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 60 పశువులను తరలిస్తుండడంతో పట్టుకున్నామన్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎండి. ఈసా, మారపాక రాజు, ఎండి. అజిత్‌అలీఖాన్, జియాముద్దీన్, లకా వత్ బాలరాజు, సాంబశివుడిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ పశువులను రాంపూర్ గోశాలకు తరలిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తాజొద్దీన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment