వరంగల్ : వరంగల్ బస్టాండ్ సమీపంలో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా ఎస్సై గన్‌మెన్ తమపై దాడికి పా ల్పడ్డాడని సంగెం మండలం కృష్ణానగర్‌కు చెందిన గోపతి శ్రీకాంత్, మేకల సాంబరాజు తెలిపారు. వారి కథనం ప్రకారం.. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం బైక్‌పై వెళ్తుండగా పోలీసులు.. శ్రీకాంత్, మేకల సాంబరాజుకు బీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో సాంబరాజుకు 109 శాతం వచ్చింది. దీనికి సంబంధించిన రశీదును ఇచ్చి కోర్టులో జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లాలని ట్రాఫిక్ ఎస్సై యాదగిరి సూచించారు. ఈ క్రమంలో పోలీ సులు వాహనాన్ని తీసుకెళ్తున్న సమయంలో శ్రీకాంత్ తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. దీంతో ఎస్సై గన్‌మెన్ వచ్చి దుర్భాషలాడుతూ శ్రీకాంత్ చేయి చేసుకున్నాడు. ఫొటో తీస్తే కొడతారా అని సాంబరాజు ప్రశ్నించడంతో అతడిపై కూడా దాడి చేశాడు. ఇంత జరుగుతున్నా ఎస్సై స్పందించలేదని బాధితులు వాపోయారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడితే జరిమానా వేయాలే తప్ప భౌతికదాడికి పాల్ప డడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు గన్‌మెన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్, సాంబరాజు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment