కోతుల బీభత్సం
ఖిలా వరంగల్ : వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో ని డాక్టర్ రవీందర్, వాసవిలేన్‌లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారిపై తిష్టవేసి విద్యార్థులు, మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల ను చెల్లాచెదురు చేస్తున్నాయని కాలనీల వాసులు వాపోతున్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ రవీందర్ హాస్పిటల్ లేన్‌లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బత్తుల సత్యం ఇంట్లో కోతులు గుంపుగా ప్రవేశించేందుకు సిద్ధపడ్డాయి. వాటిని కొట్టే క్రమంలో కోతులు సత్యంపై దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల ఇదే ఏరియాలో పారిశుద్ధ్య కార్మికురాలు, మరో ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపరిచాయని చెబుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కోతులను పట్టి నగరానికి దూరంగా వదిలేయాలని కోరుతున్నారు.
రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment