
వీడని వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ..
కాజీపేట: కాజీపేట 62వ డివిజన్ రహమత్‌నగర్ కాలనీలో గతేడాది డిసెంబర్ 14న జరిగిన వృద్ధురాలు కన్నె విజయ దారుణ హత్య కేసులో ఆధారాలు ఇంకా లభించడం లేదు. ఈ ఘటన వెలుగు చూసి 15 నెలలు గడుస్తున్నా.. నిందితులను గుర్తించడానికి ఒక్క ఆధారం కూడా పోలీసులు సంపాదించలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహమత్ నగర్ కాలనీతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టినా ఏ ఒక్క ఆధారం లభించడం లేదు. హత్య జరిగిన రోజు నుంచి దాదాపు 108 మందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివిధ కోణాల్లో విచారించినా ఒక క్లూ కూడా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మృతురాలి కుటుంబ సభ్యులను కూడా పలుమార్లు అదుపులోకి తీసుకుని విచారించిన ఫలితం కనిపించలేదు. ఫలితంగా కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. హత్య జరిగిన రోజు విధుల్లో ఉన్న పోలీసులు కాలనీలో తనిఖీలు చేయకపోవడం వల్లే నిందితులు తప్పించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. రోజులు గడుస్తున్నా నిందితులు పట్టుబడకపోవడంతో ఆ కేసు ఫైల్‌ను అటకెక్కించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది.
● 15 నెలలు గడుస్తున్నా లభించని ఆధారం
● సీసీ కెమెరాల జల్లెడ పట్టినా దొరకని క్లూ..
Comments
Please login to add a commentAdd a comment