విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్‌ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. హనుమకొండ జిల్లాలో టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల్ని 12,010 మంది విద్యార్థులు రాయనున్నట్లు డీఈఓ వాసంతి, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ సోమవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment