విద్యతోనే మహిళా సాధికారత : కేయూ వీసీ
కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలోనూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.స్వప్న, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment