చెత్తకుప్పలుగా పాత రికార్డులు
కాజీపేట అర్బన్ : పాతఫైళ్లు, వ్యర్థాలతో జిల్లా చిట్స్ కార్యాలయం డంపింగ్ యార్డ్డును తలపిస్తోంది. కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని చిట్స్ జిల్లా కార్యాలయం, సహాయ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి జిల్లాలోని వివిధ చిట్‌ఫండ్ కంపెనీలకు సంబంధించిన 12 ఏళ్ల టెంపరరీ రికార్డులు చెత్త కుప్పలుగా పడేశారు. ఇవి ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. ఈ రికార్డులను అధికారుల సమక్షంలో దగ్ధం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అంతా వీడియో తీయాల్సి ఉంటుంది. కానీ ఎవరూ చొరవ తీసుకోకపోవడంతో కార్యాలయ ఆవరణ డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. కాగా, కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు పాత రికార్డులే కదా వాటిని ఎవరికి తెలియకుండా అమ్మి సొమ్ము చేసుకుందామనే యత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అమ్మితే పలు కీలకవిషయాలు బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డంపింగ్ యార్డును తలపిస్తున్న చిట్స్ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment