గంజాయి సిగరేట్!
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని వెల్‌నెస్ సెంటర్‌లోని టాయిలెట్లకు తాళం వేసి ఉండడంతో గురువారం వెద్యచికిత్సకు వచ్చిన సీనియర్ సిటిజన్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డయాబెటిక్, బీపీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతూ వెల్‌నెస్ సెంటర్‌కు ప్రతీ రోజూ సుమారు 300మంది వరకు వస్తుంటారు. వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలు, మందుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామని వాపోయారు. ఈక్రమంలో ఒంటికి, రెంటికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టాయిలెట్లకు తాళం వేసి ఉన్న విషయాన్ని వెల్‌నెస్ సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ సన్నీ దృష్టికి తీసుకెళ్లగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ నీరు సరఫరా కాకపోవడంతో సంపులో నీరు లేదని, అందుకే టాయిలెట్లకు తాళం వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని పలు కాలనీల్లో ప్రజలు దాహం..దాహం..అంటున్నారు. శివనగర్ వాటర్ సంపుహౌస్ నుంచి అంతర్గత రహదారుల మీదుగా వెళ్లే తాగునీటి పైపులైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరా నిలిచింది. వారం రోజులుగా తాగునీటి కోసం అరిగోస పడుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివనగర్ పల్లవి ఆస్పత్రి నుంచి వాటర్ సంప్ హౌస్ మీదుగా మైసయ్యనగర్ మట్టికోట వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల అంతర్గత కాలనీలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో దూర ప్రాంతానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భానుడి ప్రతాపంతో ప్రజలు జంకుతున్నారు. నీటి సమస్యను స్థానికులు కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. ఇంటికి రెండు బిందెలు కూడా దొరకడం లేదని మహిళలు చెబుతున్నారు. అధికారులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కాజీపేట: దర్గాకాజీపేట శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం సాయంత్రం ముగ్గురు యువకులు కూర్చుని సిగరేట్ పీల్చుతున్నారు. అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన రైల్వే పోలీసులు ఆ యువకులను గుర్తించి ఏం చేస్తున్నారంటూ మందలించారు. ఆ యువకులు తాగుతున్న సిగరేట్లను అక్కడే పడేసి పారిపోయారు. తీరా ఆ సిగరేట్లను పరిశీలించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. గంజాయి సిగరేట్లు అని తెలుసుకుని అవాక్కయ్యారు. సిగరేట్ మాదిరే తయారు చేసుకుని పీల్చు తుండడం బట్టి చూస్తే నగరంలో ఈ గంజాయి పొడి లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు వరంగల్, మడికొండ, కాజీపేట శివారులోని బహిరంగ ప్రదేశాలు, కళాశాలల మైదానాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈగంజాయి సిగరే ట్లను అరికట్టకపోతే విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పోలీసులతో పాటు ఎకై ్సజ్ అధికారులు తీవ్రంగా పరిగణించి వరంగల్ నగర వ్యాప్తంగా తనిఖీలను చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
అలవాటు పడుతున్న యువత
న్యూస్‌రీల్
గంజాయి సిగరేట్!
Comments
Please login to add a commentAdd a comment