ఉద్యోగుల ఆటా... పాట
హన్మకొండ అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం కలెక్టరేట్‌లోని టీజీఓ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంఘం రాష్ట్ర నాయకులు ఎన్నమనేని జగన్మోహన్‌రావు తెలిపారు. కార్యక్రమానికి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నిర్మలా గీతాంబ, హనుమకొండ వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ పాల్గొంటారని పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆటా... పాట
Comments
Please login to add a commentAdd a comment