ఆర్టీఏపై విజిలెన్స్ నిఘా
ఖిలా వరంగల్ : వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అందించే సేవలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అధికారుల పనితీరు, వాహనదారులకు అందించే సేవలపై రహస్యంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీరో కౌంటర్ల వద్ద అందజేస్తున్న సేవలు, వాహన ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ విధానం, ఆన్‌లైన్ డ్రైవింగ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. అనంతరం జీరో కౌంటర్లలో సోదాలు చేసిన అధికారులు ఇన్‌చార్జ్ ఆర్టీఓ శోభన్ బాబును కలిసి సేవలకు సంబంధించిన కొన్ని పత్రాలను అడిగి తీసుకున్నారు. దళారుల కార్యాలయాల్లో ఏమైనా వాహనదారులకు చెందిన ఫైల్స్ ఉన్నాయా.. అనే దానిపై ఆరా తీశారు. అధికారుల పనితీరు, రవాణాశాఖ అందజేస్తున్న సేవలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
● తరచూగా ఆకస్మిక పరిశీలన, తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment