విద్యారణ్యపురి : హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువ ఉత్సవ్–25 జిల్లా స్థాయి యువజనోత్సవం,సాంస్కృతిక ప్రతిభాపాటవ పోటీలు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఎ.శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. యువతలో ఉన్నత సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులకు ఆర్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, జానపద నృత్యం, సైన్స్ ఎగ్జిబిషన్ తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులతోపాటు ప్రశాంసపత్రాలు అందజేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.రాజన్న, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, నెహ్రూ యువ కేంద్ర సూపరింటెండెంట్ బి.దేవీలాల్, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు. అధ్యాపకులు సురేశ్, ఎం.అరుణ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు కవిత, రామారత్నమాల, వి.మమత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment