నడికూడ : మండలంలోని చర్లపల్లి వద్ద నిషేధిత గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బస్టాండ్ వద్ద స్కూటీపై ఇద్దరు అనుమానాస్పందగా కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 2.840 కేజీల గంజాయి రవాణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులో తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ నాగులూర్‌కు చెందిన పప్పల్ బాలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ముదిగొండ ప్రశాంత్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1,42లక్షల వరకు ఉంటుందని, నిందితులను అదుపులోకి తీసుకొని, పరకాల పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment