హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 9వ తేదీనుంచి చర్లపల్లి–దానాపూర్, చర్లపల్లి–ముజపర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను కాజీపేట జంక్షన్ మీదుగా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఛీప్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
రైళ్ల వివరాలు..
ఈ నెల 9, 19వ తేదీన చర్లపల్లి–దానాపూర్ (07709) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 17:10 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 11, 21వ తేదీల్లో దానాపూర్–చర్లపల్లి (07710) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 21:45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 10, 15, 20వ తేదీల్లో చర్లపల్లి–ముజపర్‌పూర్ (07711) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేటకు 17:10 గంటలకు చేరుతుంది. ఈ నెల 12, 17, 22వ తేదీల్లో ముజపర్‌పూర్–చర్లపల్లి (07712) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 16:00 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అజాంఘర్–చర్లపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే వన్‌వే స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నేటినుంచి గార్లలో మణుగూర్‌కు హాల్టింగ్
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–మణుగూర్ (12745) ఎక్స్‌ప్రెస్, మణుగూర్–సికింద్రాబాద్ (12746) వెళ్లే మణుగూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నేడు (శుక్రవారం) నుంచి 6 నెలల పాటు ప్రయోగాత్మకమైన హాల్టింగ్‌ను కల్పించినట్లు ఎ.శ్రీధర్ వివరించారు.
నేటినుంచి కేవీలో అడ్మిషన్లు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశానికి శుక్రవారం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గురువారం ప్రకటన విడుదల చేసింది. మార్చి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో kvso nineadmirrion.kvr.gov.in లేదా కేవీ సంఘటన్.ఎన్‌ఐసీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment