పునరుద్ధరణ పనులు పూర్తి చేయండి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ‘కుడా’ వైస్ చైర్మన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. కొనసాగుతున్న ఫౌంటెన్ పనుల్ని పరిశీలించి సమర్థ నిర్వహణకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడికతీతను పరిశీలించారు. మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతే లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 50 వేల క్యూబిక్ మీటర్లు డీసిల్టేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఖిలా వరంగల్‌లోని ఏకశిల పార్కును కమిషనర్ సందర్శించారు. నగర ప్రజల సౌకర్యార్థం పార్కును మరింత అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించేందుకు టాయిలెట్లు, కిచెన్, డైనింగ్ హాల్, ఓపెన్ థియేటర్, కాటేజీలతో పాటు చెరువు చుట్టూ బండ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అ ధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ‘కుడా’ పీడీ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment