
మహిళలు ధైర్యంగా పోరాడాలి
● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ
● కలెక్టరేట్‌లో ఘనంగా
మహిళా దినోత్సవం
హన్మకొండ అర్బన్: గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని, ఆయా రంగాల్లో సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు మరింత ధైర్యంగా పోరాడాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, కలెక్టర్ ప్రావీణ్యను టీజీఓస్ నాయకులు.. శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈసందర్భంగా మహిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తదితకెలె పాల్గొన్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు
534 మంది గెర్హాజరు
విద్యారణ్యపురి: జిల్లాలో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 55 పరీక్ష కేంద్రాల్లో కొనసాగాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి జిల్లాలో మొత్తం 19,815 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. అందులో 19,281 మంది హాజరయ్యారు. 534 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. హనుమకొండలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో, కృష్ణవేణి జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి సందర్శించారు.
వరంగల్ జిల్లాలో 245 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,152 జనరల్ విద్యార్థులకు 4,979 మంది, 885 మంది ఒకేషనల్ విద్యార్థులకు 813 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొత్తం 245 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
పీజీ పరీక్షల్లో 10 మంది డీబార్
విద్యారణ్యపురి: కేయూ పరిధిలో పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఐదుగురు, మాస్టర్‌జీ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఐదుగురు మొత్తం 10 మంది కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment