● చైతన్య డీమ్డ్ వర్సిటీ వీసీ దామోదర్
● ముగిసిన అంతర్జాతీయ సదస్సు
విద్యారణ్యపురి: ఇంగ్లిష్ బోధనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనే పూర్తిగా ఆధారపడొద్దని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ అధ్యాపకులకు సూచించారు. హనుమకొండలోని కేడీసీలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీడిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం రాత్రి ముగిసింది. రెండురోజులుగా 167 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈసదస్సులో కేడీసీలోని ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాంభాస్కర్‌రాజు సంపా దకత్వంలో వెలువడిన ‘కరెంట్ రివ్యూ’ అనే జర్నల్‌ను చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ దామోదర్ విడుదల చేశారు. సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి, కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్, కేడీసీ ప్రిన్సిపాల్ రాజారెడ్డి, సదస్సు కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రజనీలత, పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కేయూ పాలకమండలి సభ్యుడు మల్లం నవీన్ అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment