
ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోవాలి
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయదారులు ఎ ల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వరంగల్ జిల్లా రి జిస్ట్రార్ ఫణీందర్ తెలిపారు. కాజీపేట ఫాతిమానగర్ వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్‌ఓ కార్యాలయంలో సోమవారం ఎల్‌ఆర్‌ఎస్ విధివిధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ హాజరై మాట్లాడుతూ.. మార్చి 31 వరకు.. 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున మాడ్యూల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాకే పూర్తి చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్లకు రావాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు ఎల్‌ఆర్‌ఎస్–20 మాడ్యూల్‌పై భూక్రయవిక్రయదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూంల తనిఖీ
హన్మకొండ అర్బన్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్టులో జిల్లాకు సంబంఽధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) భద్రపర్చిన స్ట్రాంగ్ రూములను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సోమవారం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. మూడు నెలలకోసారి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించే త్రైమాసిక సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
444 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ప రీక్షల్లో 444 మంది విద్యార్దులు గైర్హాజరయ్యా రు. జిల్లాలో మొత్తం 18,560 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. అందులో 18,116 మంది మాత్రమే హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. సుబేదారిలోని కాకతీయ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
పెన్సిల్ మొనపై ఐసీసీ ట్రోఫీ
హన్మకొండ: హనుమకొండ గోపాలపూర్‌కు చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ పెన్సిల్ మొనపై ఐసీసీ చాంపియన్ షిప్ ట్రోఫీని రూపొందించాడు. ఐసీసీ చాంపియన్‌గా భారత్ నిలిచిన క్రమంలో శ్రీజిత్ 1.8 మిల్లీ మీటర్ల ఎత్తులో ఈ ట్రోఫీని తయారు చేశాడు. దీన్ని చెక్కడానికి 1.30 గంటల సమయం పట్టిందని కళాకారుడు చెబుతున్నాడు. తాను కెప్టెన్ రోహిత్ శర్మ వీరాభిమానినని, ఆయన కెప్టెన్సీలో టీమ్ స్పిరిట్‌తో బాగా ఆడి భారత్ ఐసీసీ చాంపియన్‌షిప్ కప్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కేయూలో నేటి నుంచి
జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యునాలజీ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్‌మెంట్’ అంశంపై ఈనెల 11, 12 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు.
కామర్స్ విభాగంలో రెండ్రోజులపాటు..
కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఈనెల 12, 13 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు సెమినార్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పి.అమరవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘న్యూ హారిజన్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ అండ్ ఆపర్చునిటీస్’ అంశంపై సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment