
పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్‌తోపాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, అధికారులు ఉన్నారు.
24 గంటలు అందుబాటులో ఉంటా..
నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్
బాధ్యతల స్వీకరణ

పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
Comments
Please login to add a commentAdd a comment