
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీకి గడువు నెలాఖరు
వరంగల్ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ సదుపాయాన్ని లేఔట్, నాన్ లేఔట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి ఎల్‌ఆర్‌ఎస్‌పై లేఔట్ డెవలపర్లు, సర్వేయర్లు, యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కచ్చా లే ఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్‌లు తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు (మార్చి 31) వరకే ప్రభుత్వం గడువు కల్పించినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఎల్‌ఆర్ ఎస్‌కు సంబంధించి ఏ సమస్యలున్నా.. బల్దియా అధికారుల దృష్టికి తీసుకొస్తే సహకరిస్తారనన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ డెవలపర్లు, ప్లాట్ల యజమానులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి, సంబంధిత శాఖల అధికారులతో పాటు లేఔట్, నాన్ లేఔట్ యజమానులు డెవలపర్లు, టౌన్ ప్లానర్లు, లే ఔట్ రైటర్లు, బిల్డర్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment