టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Apr 5 2025 1:35 AM | Updated on Apr 5 2025 1:35 AM

టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు అన్నారు. టెక్స్‌టైల్‌ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. పరకాల మున్సిపల్‌ సమావేశమంది రంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లోని ఇండస్ట్రీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్య త ఇవ్వాలని, అందుకు స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ద్వా రా స్థానికులకు నైపుణ్యం కల్పించి నియమించుకో వాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ లే అవుట్‌లో పట్టాలిచ్చిన 863 మంది రైతులకు వారి అభ్యర్థన మేరకు 50 గజాల నుంచి 75 గజాలు అందించేందుకు టీజీఐఐసీ ద్వారా అదనంగా రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. తిరిగి లేఅవుట్‌ ప్లాట్లు చేసి రాజీవ్‌ గాంధీ టౌన్‌ షిప్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ జీడీపీ పథకం ద్వారా రూ.10.10 కోట్ల వ్యయంతో చేపట్టిన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్స్‌, మంచినీటి సరఫరా, సంప్‌, పరిపాలన భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, జూలై 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు.

గంజాయి, గుడుంబా నివారణకు చర్యలు

టెక్స్‌టైల్‌ పార్క్‌లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందని అలాంటి కార్యకలాపాలపై పోలీసులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కోరారు.

ఒక్కో ఉద్యోగానికి 3వేల మంది పోటీ

రాష్ట్రంలో ఒక్కో ఉద్యోగానికి 3వేల మంది ఉద్యోగులు పోటీ పడుతున్నారు.. గత ప్రభుత్వం ఖాళీ అయిన ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంతో నిరుదోగుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరకాల పట్టణంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళాను ప్రారంభించి, ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ లెటర్‌లను మంత్రి అందజేసి మా ట్లాడారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో స్కిల్‌ యూనివర్సిటీ, అన్ని జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరకాల, హనుమకొండ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్‌లు ప్రావీణ్య, సత్యశారద, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకాడే, డీఎఫ్‌ఓ అనుజ్‌ అగర్వాల్‌, అదనపు కలెక్టర్లు వెంకట్‌రెడ్డి, సంధ్యారాణి, డీఆర్‌డీఓ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీధర్‌బాబు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌

అభివృద్ది పనుల పురోగతిపై

అధికారులతో సమీక్ష సమావేశం

కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

పరకాల నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా 51 బ్యాచ్‌లలో 1,717 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది మహిళలకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement