
నేడు రాములోరి కల్యాణం
నేడు (ఆదివారం) జరగనున్న సీతారాముల కల్యాణానికి నగరంలోని పలు రామాలయాలు, హనుమాన్ మందిరాలు ముస్తాబయ్యాయి. ఎండాకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామీయానాలు, పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయం, ఎల్లంబజార్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి అలయం, హనుమకొండ రెవెన్యూ కాలనీలోని రామాలయం, వేయిస్తంభాల దేవాలయంతోపాటు పలు దేవస్థానాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వేయిస్తంభాల ఆలయంలో శనివారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రాభిషేం చేశారు. రాములవారిని అయోధ్య రాముడిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ద్వజారోహణం నిర్వహించారు. యాగశాలలో సుదర్శన హోమం జరిపారు. సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని గంగు ఉపేంద్రశర్మ కోరారు. – హన్మకొండ కల్చరల్

నేడు రాములోరి కల్యాణం

నేడు రాములోరి కల్యాణం