
రోడ్డు వేసిన మరుసటి రోజే తవ్వారు
దశాబ్దాలుగా మారెమ్మ చెట్టు నుంచి అలంకార్ వరకు అద్వానంగా ఉన్న రోడ్డును ఇప్పుడు వేస్తుండడం సంతోషంగా ఉంది. కానీ, రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే తవ్వి డ్రెయినేజీని దారి మళ్లించి తిరిగి కల్వర్టు నిర్మించాడు. ఇదేంటని మా కాలనీ వారందరం పరిశీలిస్తే పక్కనే నిర్మిస్తున్న బడాషాపింగ్ కాంప్లెక్స్ ఎదుట డ్రెయినేజీ లేకుండా చేయడం కోసమని తెలిసింది. అశాసీ్త్రయ డ్రెయినేజీ నిర్మాణంతో మా కాలనీలకు వరద ముంపును తెచ్చినట్లే. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరదనీరు సాఫీగా వెళ్లేలా డ్రెయినేజీ నేరుగా నిర్మించాలి.
– నరసింహస్వామి, రాజ్‌పుత్‌కాలనీ