
వినతులు వెంటనే పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను అదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావా ణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 12, తహసీల్దార్ హసన్‌పర్తి 7, డబుల్ బెడ్‌రూం నోడల్ ఆఫీసర్ 6, ఆర్డీఓ హనుమకొండ 6తో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 106 దరఖాస్తులు స్వీ కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అ దనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీ ఆర్డీ ఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆ ర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, జిల్లా అ ధికారులు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి..
వేసవి నేపథ్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, జలాశయాల వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజవాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వీలైతే జలాశయాల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటుతో పాటు గ్రామాల్లో చిన్న పిల్లలు, పెద్దలు సంరక్షకులు లేకుండా బావులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లవద్దని డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని రాజేందర్, సీతారామారావు, తాడూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పరిశీలించండి:
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వరంగల్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణితో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తే బాధితులు పదే పదే ప్రజావాణికి వచ్చే అవకాశం ఉండదన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 93 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
శ్మశానవాటికకు హద్దులు నిర్ణయించాలి..
వరంగల్ దేశాయిపేట గ్రామశివారులోని సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిలో ది పెంతెకొస్తు మిషన్ చర్చి క్రైస్తవులకు సంబంధించిన (సమాధుల స్థలం) శ్మశానవాటికకు హద్దులు పెట్టాలి. 1.35 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 17 గుంటలు మాత్రమే మిగిలింది. స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. హద్దులు పెట్టాలని రెండేళ్ల క్రితం ల్యాండ్ సర్వే అధికారులకు ఆదేశాలు జారీ అయినా ఇప్పటి వరకు హద్దులు ఏర్పాటు చేయలేదు.
అధికారులను ఆదేశించిన
కలెక్టర్ ప్రావీణ్య
ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

వినతులు వెంటనే పరిష్కరించండి