
లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్ : రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలని రైల్వేమజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మే రకు సోమవారం కాజీపేట రైల్వే క్రూ లాబీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాప్ సమస్యలపై రైల్వే బోర్డుతో చర్చలు జరిగాయన్నారు. ఇందుకు రైల్వే బోర్డు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే ఆ కమిటీ ఈ నెల 4వ తేదీ న బోర్డుకు సమర్పించిన నివేదిక రన్నింగ్‌స్టాప్‌కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ రిపోర్టును అమలు చేయొద్దని డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా అన్ని క్రూ లాబీల వద్ద చేస్తున్న నిరసనలో భాగంగా కాజీపేట లాబీ వద్ద కూడా నిరసన చేపట్టామని తెలిపారు. బ్రాంచ్ చైర్మన్ సంగ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ సాయికుమార్, రమేశ్, ఎన్.కుమారస్వామి, ఎ.కుమారస్వామి, ఎం. ప్రవీణ్, ధనరాజ్, వలీఅహ్మద్, ఎన్.శ్రీనివాస్, వి.ప్రసాద్, భరత్‌లోకోశ్, రమణాచారి, ఆంజనేయులు, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
రైల్వే మజ్దూర్ యూనియన్ నేతల డిమాండ్