
20నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 20నుంచి 26వ తేదీవరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలపై మంగళవారం డీఆర్‌ఓ గణేశ్.. డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాటు వివిధ శాఖల అధికారులు, డీఐఈఓ తదితరులతో సమీక్షించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయని కోఆర్డినేటర్ పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు www.telangana epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్
పోటీలకు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్ : సికింద్రాబాద్‌లోని లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను మంగళవారం ఎంపిక చేశారు. బి.నితిన్ 50 కేజీల కేటగిరీలో, ఎన్.రాజర్శి 80 కేజీలు, జి.భరత్ 65 కేజీల విభాగాల్లో ఎంపికై నట్లు కార్యదర్శి పోతరాజు రాజేందర్ తెలిపారు.
‘కై టెక్స్’లో ఉద్యోగాల
భర్తీ ప్రక్రియ షురూ..
గీసుకొండ: వరంగల్ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో కేరళకు చెందిన చిన్న పిల్లల దుస్తుల తయారీ కై టెక్స్ కంపెనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ మేరకు 25,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లు తదితర విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీచేయనుంది. రెండు రోజుల నుంచి పలువురు నిరుద్యోగులు కంపెనీ వద్దకు వచ్చి తమ బయోడేటాలు అధికారులకు సమర్పిస్తున్నారు.