
అదుపు తప్పి ఆటో బోల్తా..
● ముగ్గురు విద్యార్థులు,
రౖడైవర్‌కు తీవ్ర గాయాలు
● కాచికల్ శివారులో ఘటన
నెల్లికుదురు: విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నారు. గతంలో తొర్రూరు నుంచి నెక్కొండ వరకు వయా కాచికల్, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, బూర్గుమళ్ల, కల్లెడ, పర్వతగిరి మీదుగా నడిచిన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం రద్దు అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లేని కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల్లో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు ఆటోలో వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆటో కాచికల్ శివారులోని ప్రధాన రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ముద్రాల అక్షిత్, యాటగాని హర్షిత్, సాయి చరణ్‌తో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.