కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్‌లు

Apr 10 2025 1:23 AM | Updated on Apr 10 2025 1:23 AM

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్‌లు

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్‌లు

కేయూ క్యాంపస్‌: తెలంగాణలోని 12 యూనివర్సి టీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవా రం ఉదయం వరకు కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కళాశాలలు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను ముందస్తు అరెస్ట్‌లు చేసి వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. ఇందులో మహిళా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా కేయూ, హనుమకొండ, సుబేదారి తదితర పోలీస్‌ స్టేషన్లలో ఉంచారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సుమారు 50 నుంచి 60మంది వరకు అరెస్ట్‌ అయిన వారిలో ఉన్నారని సమాచారం. యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌, కేయూ బీసీసెల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, కేయూపాలకమండలి సభ్యుడు చిర్రరాజు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం బాధ్యులు సదాశివ, గడ్డం కృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కూడా కొందరు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వెళ్లారు. అందులో కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌కుమార్‌లోథ్‌, పలువురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను మిగతా యూనివర్సిటీల కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను అక్కడ పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలి

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,270మంది కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్‌ చేశాక మిగతా పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని, ఇటీవల తీసుకొచ్చిన జీఓ 21ని రద్దుచేయాలని డిమాండ్‌తో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను అరెస్ట్‌ చేశారని, వారిని విడుదల చేయాలని కేయూ కోఆర్డినేషన్‌ కమిటీ బాధ్యులు సాధురాజేశ్‌, బి. సతీశ్‌, మాదాసి కనకయ్య డిమాండ్‌ చేశారు. అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, గురువారం బంద్‌ పాటించనున్నట్లు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది.

ఇదేనా ప్రజాపాలన..

తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను అరెస్ట్‌ చేయటం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఇదేనా ప్రజాపాలనా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య పరిష్కారం చూపాకే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కొందరు ఇక్కడే..

మరికొందరు హైదరాబాద్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement