
‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కవి, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, వీఆర్‌విద్యార్ధి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్‌సింగ్‌ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.