
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్‌కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో తక్కళ్లపహాడ్ పాఠశాల సమీ పానికి రాగానే జాన్‌డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రగా యాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తిగల పీడీ, పీఈటీలు, సీనియర్ జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు పూర్తి వివరాలతోపాటు క్రీడా సర్టిఫికెట్లను జతపర్చాలని, దరఖాస్తుదారు ఎక్కడ ఉండి మే నెలలో ఉదయం సాయంత్రం శిక్షణను సక్రమంగా ఇవ్వగలరో దరఖాస్తులో స్పష్టం పేర్కొనాలని పేర్కొన్నారు. జీఓఎంఎస్ నంబర్ 74 ప్రకారం క్రీడాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. మే 1 నుంచి 31 వరకు వివిధ క్రీడాంశాల్లో తర్ఫీదునివ్వాల్సి ఉంటుందని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఓ సిటీ మినీ స్టేడియం లక్ష్మీపురం వరంగల్, జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77021 55096లో సంప్రదించాలని కోరారు.