
జానకమ్మ సహకారం గొప్పది..
పర్యావరణ పరిరక్షణలో రామయ్య రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. రామయ్యతో పాటు ఆయన సతీమణి జానకమ్మ కూడా ప్రతీ కార్యక్రమానికి హాజరయ్యేవారు. రామయ్య కృషిలో పాలుపంచుకునేవారు. ఆమె సహకారం గొప్పది.. తన పిల్లలతో పాటు మొక్కలను ప్రాణంగా పెంచుకున్నారు. ఎక్కడైనా ఖాళీస్థలం కనిపిస్తే విత్తనాలు చల్లుతూ, మొక్కలు నాటేవారు. రామయ్య మృతి తీరనిలోటు. నిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో మాట్లాడా. ఆ దంపతులను సన్మానించా.
– వల్లంపట్ల నాగేశ్వరరావు, వనప్రేమి అవార్డు గ్రహీత, కవి, రచయిత, కళాకారుడు, హనుమకొండ