సీఎం సమావేశంలో కలెక్టర్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం సమావేశంలో కలెక్టర్లు

Apr 15 2025 1:14 AM | Updated on Apr 15 2025 1:14 AM

సీఎం

సీఎం సమావేశంలో కలెక్టర్లు

వరంగల్‌: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, ప్రావీణ్య పాల్గొన్నారు. ఈసమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగు నీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

అగ్ని ప్రమాదాలపై

అప్రమత్తత అవసరం

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్‌: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్‌ శివనగర్‌లోని అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఈ నెల 14 నుంచి 20వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను మేయర్‌ గుండు సుధారాణి, ఏసీపీ నందిరామ్‌నాయక్‌, డీఎఫ్‌ఓ కేవీ సతీశ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఓ రాజేశ్వర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో జమేదార్‌ మాధవరెడ్డి, నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, కార్పొరేటర్‌ సొమిశెట్టి ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మృత పిండం అప్పగింత

ఎంజీఎం: నగరంలోని రైల్వే గేట్‌ సమీపంలో కేవీఎన్‌ రెసిడెన్సీ నివాసి అయిన భావన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదకరమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు తల్లికి అపాయం జరుగుతుందని పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీ వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌ వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి ఆదేశంతో కళాశాల అనాటమీ విభాగానికి మృత పిండాన్ని అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్‌ రెన్యువల్‌ పనులు

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే స్టేషన్‌లో సోమవారం రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు ట్రాక్‌ రెన్యువల్‌, మరమ్మతు పనులు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాక్‌ను తనిఖీ చేసి మరింత సమర్థవంతంగా ఉండేందుకు యంత్రాల సాయంతో మరమ్మతు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌ 11: హనుమకొండలోని గాంధీనగర్‌ పోచమ్మ గుడి సమీపంలోని షామా డిస్ట్రిబ్యూటరీలో ఎక్స్‌పైరీ తేదీలు ముద్రించకుండానే ఐస్‌క్రీమ్‌లు ప్యాక్‌ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. టాస్క్‌ ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడి చేసి నిబంధనలు పాటించకుండా ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు. రూ.25,740 విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు మొహమ్మద్‌ జాన్‌ పాషాను అదుపులోకి తీసుకున్నారు.

ఏప్రిల్‌ 12: మడికొండలోని కనకదుర్గ కాలనీలో ఓంకార్‌ ఐస్‌ క్రీమ్‌ డిస్ట్రిబ్యూటరీలో టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. తయారీ, ఎక్స్‌ పైరీ తేదీలు ముద్రించకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.2,39,476 విలువైన ఐస్‌ క్రీమ్‌ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు వొల్లాల రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏప్రిల్‌ 14: వరంగల్‌ బాలాజీనగర్‌లోని కూల్‌ టచ్‌ ఐస్‌ క్రీమ్‌ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్‌ పైరీ తేదీలు ముద్రించకుండా, లైసెన్స్‌ లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.83,200ల విలువైన ఎనిమిది రకాల ఉత్పత్తులను గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.పవన్‌కుమార్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కృష్ణమూర్తి సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అల్లిపురం శ్రీపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.

సీఎం సమావేశంలో కలెక్టర్లు  1
1/3

సీఎం సమావేశంలో కలెక్టర్లు

సీఎం సమావేశంలో కలెక్టర్లు  2
2/3

సీఎం సమావేశంలో కలెక్టర్లు

సీఎం సమావేశంలో కలెక్టర్లు  3
3/3

సీఎం సమావేశంలో కలెక్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement