
సాక్షి, సిటీబ్యూరో: జగ్‌నే కీ రాత్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం ప్రకటించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రత్యామ్నాయాలు లేని గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
వీటితో పాటు పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) కూడా ఆ సమయంలో మూసేస్తున్నట్లు ప్రకటించారు. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment