
హైదరాబాద్: తనకు కేన్సర్ వచ్చిందేమోననే భయంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పవన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతల్‌కు చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్(19) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం అతడికి రక్తంతో కూడిన వాంతి అయ్యింది.
దీంతో తనకు కేన్సర్ సోకిందేమోనని శరత్ ఆందోళనకు గురైన శరత్ ఈ విషయాన్ని తల్లి లక్ష్మిభాయికి చెప్పగా, తెలపగా వినాయక చవితి మరుసటి రోజు మంచి అస్పత్రిలో పరీక్షలు చేయిస్తానని చెప్పింది. అయినా శరత్ తనలో తాను మదన పడేవాడు. సోమవారం లక్ష్మిబాయి వినాయకుడి పూజ నిమిత్తం మండపం వద్దకు వెళ్లింది. రాత్రి 7 గంటలకు ఆమెకు ఫోన్ చేసిన శరత్ త్వరగా ఇంటికి రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
లక్ష్మి ఇంటికి చేరుకోగానే తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా శరత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment