
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అంటే మజ్లిస్‌కు అడ్డా. ఇక్కడ రాజకీయాలను శాసించే స్థాయి మజ్లిస్‌ది మాత్రమే. పాతబస్తీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ముస్లిం అభ్యర్థి తప్ప మరెవరూ గెలవలేరని ఒక నానుడి కూడా ఉంది. కానీ ఒక్క కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం భారతీయ జనతాపార్టీ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించింది. కార్వాన్ టైగర్‌గా పేరొందిన బద్దం బాల్‌రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. రెండు దశాబ్దాల పాటు బీజేపీకి ఇక్కడ ఎదురే లేదు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్వాన్ స్థానం నుంచి మజ్లిస్ పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బాకర్ ఆగా గెలిచారు. ఆ తర్వాత 1985, 1989, 1994లలో వరుసగా బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్‌రెడ్డి మజ్లిస్‌పై విజయం సాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి 1991, 1998, 1999లో బీజేపీ తరఫున బరిలో దిగి మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానికి పరిమితమయ్యారు.
కాగా, కార్వాన్‌న్ అసెంబ్లీ స్థానానికి 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పక్షాన బరిలో దిగిన కిషన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పట్లో మజ్లిస్ నుంచి ఎన్నికై న సయ్యద్ సజ్జాద్ మృతి చెందడంతో 2003 ఉప ఎన్నికతోపాటు 2004, 2014 ఎన్నికల్లో మరోసారి బద్దం బాల్‌రెడ్డి బరిలో దిగినప్పటికీ పరాజయం తప్పలేదు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆయన మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment