కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బహ్రెయిన్ | Bahrain Country To Approve Pfizer-BioNTech Vaccine | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బహ్రెయిన్

Published Sat, Dec 5 2020 11:40 AM | Last Updated on Sat, Dec 5 2020 12:20 PM

Bahrain Country To Approve Pfizer-BioNTech Vaccine - Sakshi

మనమా‌: ఫైజర్‌-బయోటెక్‌ కరోనా ‍వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లుగా బహ్రెయిన్‌ తెలిపింది. బ్రిటన్‌ తరువాత ఈ వ్యా‍క్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రెండవ దేశం ఇదే. వ్యాక్సిన్‌ ఆమోదంతో కోవిడ్‌-19 నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్‌ అల్‌ జలాహ్మా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యూఎస్‌ ఔషద దిగ్గజం ఫైజర్‌ ఇంకా జర్మన్‌ భాగస్వామి బయోటెక్‌ ఈ టీకాను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. సాధారణ ఉపయోగం కోసం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చేవారం నుంచి దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు బ్రిటన్‌ బుధవారం తెలిపింది.  చదవండి:  (వ్యాక్సిన్‌ : సీరం పూనావాలా అరుదైన ఘనత) 

మరోవైపు నవంబర్‌లో బహ్రెయిన్‌.. చైనాకు చెందిన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌పై ఉపయోగించడాన్ని ఆమోదించింది. బహ్రెయిన్లో ఇప్పటికే 87 వేలకుపైగా కేసులు నమోదు కాగా, 341 మంది మరణించారు. ఫైజర్‌-బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్‌ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బ్రిటన్‌ శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్‌ చైనాలో మొదలయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది మృతి చెందగా, 65 మిలియన్లకిపైగా కరోనా బారినపడ్డారు.  చదవండి:  (కొన్ని వారాల్లో వ్యాక్సిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement