వీడియో దృశ్యాలు
న్యూయార్క్ : జాతి వివక్ష కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వైద్యురాలికి సరైన చికిత్స అందివ్వకుండా ఆమె మరణానికి కారణమైందో తెల్లజాతి వైద్యురాలు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సూసన్ మూరే (50) అనే ఓ వైద్యురాలు కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడి ఇండియానా పొలీస్‌లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆమె గొంతులో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారింది. దీంతో తనకు చికిత్స అందిస్తున్న వైద్యురాలికి విషయం చెప్పింది. అయితే ఆమె మూరే మాటలు నమ్మలేదు. తొందరగా ఇంటికి పంపించడానికి చూసింది. ఈ నేపథ్యంలో మూరే తన గోడును వెల్లబోసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను తీసింది. (అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..)
ఆ వీడియోలో.. ‘‘ నా గొంతులో చాలా నొప్పిగా ఉంది. నలిపేస్తున్నట్లుగా ఉంది. తెల్లజాతి వైద్యురాలు నాపట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. నేను ఏం చెప్పినా నమ్మటం లేదు. నన్ను డ్రగ్స్‌కు బానిసలాగా చేసింది. త‍్వరగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేద్దామని చూస్తున్నారు. నేనో తెల్లజాతి దాన్నయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. ఇలానే చాలా మంది నల్లజాతి వాళ్లు చనిపోతున్నార’’ని అన్నదామె. ఈ వీడియోను వైద్యులకు చెందిన ఓ ఫేస్‌బుక్ గ్రూపులో షేర్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మూరే మరణించింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment